Chinna ananthagiri shivalayam | Rambagh | Attapur | Hindu temples guide

 

ఈ ఆలయం సుమారు 500 సం || క్రితమే నిర్మించారు. ఈ ఆలయాన్ని అక్కన మాదన్న హయాంలో నిర్మించారు అని తెలిస్తుంది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల పిల్లర్ నెంబర్ 143 కి ఎడమ పైపు కొంచం దూరం వస్తే ఉంటుంది. 

ఇక్కడ ప్రధాన దేవత మూర్తి ఆది దేవుడు శంకరుడు. ఏక శిలా పై చక్కటి శివ ఆకృతి చూడగానే మనసు లాగేస్తుంది. 

ఈ ఆలయంలో గణపతి ఆలయం , శివ ఆలయం , దుర్గా దేవి ఆలయం , శ్రీ రాధా కృష్ణ ఆలయం , గోశాల , నవగ్రహ మండపం కలవు. 

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ శివయ్య ఆలయంలో వలె మొదట ధ్వజ స్థంబం ఉండదు. దానికి బదులు ఆంజనేయ స్వామి మూర్తి ఉంటారు. ఇలా కేవలం రామేశ్వరంలో మాత్రమే ఉంటుంది. 

ప్రస్తుతం ఈ ఆలయం శ్రీ ప్రణవ భక్త సమాజం అనే ట్రస్ట్ వారు చూస్తున్నారు. ఆలయంలో ప్రవేశించగానే చాలా ప్రశాంతత లభిస్తుంది. ఈ ఆలయంలో శివరాత్రి చాలా ఘననంగా చేస్తారు. జాగారం , రాత్రి అంతా భజాన నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం 12:00 నుంచి 4:30 వరకు బ్రేక్ 

సాయంత్రం 04:30 నుంచి 08:00 వరకు 

#Chinna ananthagiri shivalayam #rambagh #Attapur #Hyderabad temples #Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana