Ashtalakshmi Temple | Dilsukhnagar | Hindu temples guide
ఈ అలయాం హైదరాబాద్ లోని దిల్ సుఖనగర్ వద్ద గల కొత్తపేట లో కలదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయంలో మనకి అష్ట లక్ష్మీ లు దర్శించుకోవచ్చు.
ఈ ఆలయాన్ని సుమారు 27 సం|| పూర్వం పరమపూజ్యులైన జగద్గురువు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి , శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి మరియు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ వారి చేతుల మీదుగా ప్రతిష్ట జరిగినది.
ఈ అలయంలోకి వెళ్ళగానే ప్రశాంత వాతావరణం మనసుకి ఎంతో ప్రశశాంతని లభిస్తుంది.
ఈ ఆలయం కంచి కామకోటి పీఠం వారి ఆద్వర్యంలో నడుస్తుంది.
ప్రతి శుక్రవారం మరియు ఆదివారం ఉదయం 11:30 నుంచి 01:00 వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది.
ఆలయం దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:00 వరకు
మధ్యననం 12:00 నుంచి 05:00 వరకు బ్రేక్
సాయంత్రం 05:00 నుంచి 08:00 వరకు
ఇక్కడ దసరా , దీపావళి, శ్రీ రామ నవమి , శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.
ఇప్పడు ఈ ఆలయానికి ఒక ట్రస్ట్ నిర్వహించారు.
#Ashtalakshmi Temple #Dilsukhnagar #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment