Ananta giri | Kala Hanuman temple | Rambagh | hyderaguda | Attapur | Hindu temples guide
ఈ ఆలయం pvnr express way పిల్లర్ నంబర్ 161 వద్ద రాయల్ ఒకే షాప్ వెనుక కలదు. ఈ ఆలయం లో శ్రీ అనంత పద్మనాభ స్వామి , శ్రీ ఆంజనేయ స్వామి , శివుడు కలరు. ఈ ఆలయం బయట పెద్ద గోశాల కలదు. అందులో దాదాపు 2000 గోవులు కలవు. ఇక్కడ ఉదయం వస్తే చక్కగా నెమాళ్ళు కూడా చూడవచ్చు. ఆలయం బయటికి పెద్దగా కనిపించక పోయిన లోపల చాలా పెద్దగా ఉంటుంది.
గోల్కొండను పాలించిన తానీషా వద్ద మంత్రులుగా ఉండిన అక్కన్న మాదన్న సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతర కాలంలో గుట్ట మీద ఉన్న గుహలో నాగేంద్రుడు కనిపించేవాడట. అదే విధంగా అర్హులైన భక్తులకే శ్రీ మన్నారాయణుడు అనంత శయనునిగాను, శ్రీ తిరుమల వెంకటేశునిగాను దర్శన మిచ్చేవారట. అలా గుట్ట మీద శ్రీ అనంత పద్మనాభ స్వామి కోవెల రూపుదిద్దుకొన్నది.
అందుకే ఈ క్షేత్రానికి అనంతగిరి అన్న పేరొచ్చినది.
అప్పట్లో జనమేజయుడు ప్రతిష్టించిన అంజనా సుతుని విగ్రహం మరుగున పడిపోగా, పదహారవ శతాబ్దంలో విజయ నగరాధీశుడైన శ్రీ కృష్ణ దేవరాయల వారి గురువైన శ్రీ వ్యాస రాయలు వెలికి తీసి పునః ప్రతిష్టించారు.శ్రీ వ్యాస రాయలు శ్రీ ఆంజనేయ ఉపాసకులు.ఎన్నో హనుమంతుని ఆలయాలను నిర్మించారు. మరుగున పడిన వాటిని వెలుగు లోనికి తెచ్చారు.
తొలుత ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి స్వయంభూగా గుహలో వెలిశారని చెబుతారు. అచిర కాలం లోనే భక్తులకు లభించిన దివ్యానుభూతులతో యిది హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ది కెక్కినది.
వాయు నందనుడు స్వయంగా ఆదేశించినందున ఇతర దేవాలయాలలో మాదిరి ఇక్కడ స్వామికి సింధూర వర్ణ లేపనం చేయరు. ఈ కారణం చేతనే ఇక్కడి రామ దూత " కాలా ( నల్లని ) హనుమంతు"నిగా పేరొందారు.
#Ananta giri #Kala Hanuman temple #Rambagh #hyderaguda #Attapur #Hindu temples guide
Comments
Post a Comment