Sri Subrahmanya Swamy Devalayam, Skandagiri | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కి 3కి.మీ. దూరంలో పద్మరావ్ నగర్ నందు కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సుబ్రమణ్య స్వామి. పెళ్లి కానీ వారు, పెళ్లి జరిగి ఏ కారణం వల్ల ఐన గర్భం నిలవకుండా ఉన్న వారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు. ఆలయం కంచి కామకోటి వారిచే నడిపించబడుతుంది. ఈ ఆలయం పూర్తిగా తమిళనాడు ఆలయాల వలె పోలి ఉంటుంది. ఈ ఆలయం పక్కనే 10 అడుగుల ఆంజనేయ స్వామి చూడముచ్చట గా దర్శనం ఇస్తారు. గత సం|| శ్రీ కంచి కామకోటి పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంధ్రా సరస్వతి స్వామి వారు 1 నెల రోజులు ఇక్కడ చతుర్మాస్య దీక్ష చేశారు. అప్పుడు ప్రజలు తండోప తాండలు గా ఈ ఆలయానికి వచ్చారు.
ఈ ఆలయంలో మొదట శ్రీ ఆంజనేయస్వామి పక్కనే శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి పాదుకాలు ఎదురుగా కంచి కామకోటి పరమాచార్య స్వామి మూర్తి దర్శనం ఇస్తారు. తరువాత పక్కన మొదటి అంతస్థులో మొదట వరసిద్ది వినాయక స్వామి, శ్రీ సుబ్రమణ్య స్వామి తో పాటు , కంచి ఏకాంబరేశ్వర స్వామి , కంచి కామాక్షి అమ్మవారు , దుర్గా దేవి , చిదంబర నటరాజస్వామి , నవగ్రహ మండపం, తెల్లరాతి తో నిర్మించిన శ్రీ ఆది శంకరాచార్య స్వామి ని దర్శించుకోవచ్చు. బయటి నుంచి చూస్తే ఆలయ నమూనా మొత్తం దేశంలోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయాలు నమూనా దర్శించుకోవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఆదివారం & శుక్రవారం :
ఉదయం : 06:00 నుంచి 12:00
సాయంత్రం : 04:30 నుంచి 09:00
సోమవారం, బుధవారం & గురువారం , శనివారం :
ఉదయం : 06:00 నుంచి 11:00
సాయంత్రం : 04:30 నుంచి 09:00
మంగళవారం :
ఉదయం : 06:00 నుంచి 12:00
సాయంత్రం : 03:00 నుంచి 09:00
అని ప్రధాన ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి రావాలి అంటే మొదట బస్ మరియు రైల్ లో వచ్చే వారు మొదట సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి ఆటో లో ఈ ఆలయానికి చేరుకోవాలీ. ప్రత్యేక సందర్బాలలో ఆలయ సమయాలు మరవచ్చు గమనించగలరు.
ఆలయ చిరునామా :
Sri Subrahmanyaswamy Devalayam.
Skandagiri, Kamakotinagar, Padmarao Nagar,
Secunderabad 500061, Telangana, India
Telephone : Administrative Office: 040 2750 4849 ( From 10:30 A.M. to 8:30 P.M.)
Front Office : 040 2751 0011
E- Mail : info@srisubrahmanyaswamydevalayamskandagiri.org
.
.
#Hyderabad Temples, #Budget travel, #hyderabad vlog, #viral #hindutemplesguide #HiddenHyderabadTemples


Comments
Post a Comment