Chilkur Balaji Temple | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చిలుకూర్ అనే గ్రామం లో రంగరెడ్డి జిల్లాలో కలదు. ఈ ఆలయానికి ప్రధాన మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామిని వీసా ల దేవుడు అని కూడా పిలుస్తారు.
ఆలయ చరిత్ర : పూర్వం ఆ భక్తుడు ప్రతి నెల తిరుపతి కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునే వాడు. కాలం గడిచే కొలది ఆ వ్యక్తి శరీరంలో మార్పు వచ్చినది. స్వామి ని దర్శనం చేయడం కష్టం అయ్యేది. ఆ భక్తుడు బోరున విలపించాడు. స్వామి నాకు ని దర్శనం లేదా అని ఎడవసాగాడు. ఆ భక్తుని భక్తి కి మెచ్చి స్వామి నేను ఈ గ్రామం లో ఉన్నాను. నీవు నన్ను ఇకపై ఇక్కడే దర్శించుకోవచ్చు అని కలలో చెప్పగా వచ్చి ఆ ప్రాంతంలో ఆ గ్రామ ప్రజలు వెళ్ళి చూడగా స్వామి అక్కడే దర్శనం ఇచ్చాడు. ఇక్కడ స్వామి ని ప్రత్యేకంగా వీసా ల స్వామి అనే పేరు కూడా కలదు. అందుకు కారణం ఇక్కడ ఏవరు ఐతే వీసా రాకుండా ఇబ్బంది పడుతున్నారో వారు స్వామి వారికి మొదట 11 ప్రదక్షిణలు చేసి మొక్కు మొక్కుకొని వెళ్ళితే వీసా వస్తుంది అనే చాలా మంది నమ్మకం. ఇలా చాలా మందికి జరిగినది. అనుకున్న కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి స్వామి వారికి ప్రక్షిణ పేపర్ సమర్పించాలి.
ఆలయ ప్రత్యేకత : ఈ ఆలయం లో విఐపి లైన్ లు, ప్రత్యేక లైన్ లు హుండీ కూడా ఉన్నడవు. ఎంత పెద్ద పదవి లోని వారు ఐఎన సరే అందరూ స్వామి వారు ముందు అందరూ సమానమే అని తెలుపడానికి ఇలా పెట్టారు.
చేరుకునే విధానం : ఈ ఆలయానికి ప్రదానంగా బస్ లు కలవు. 288D అనే బస్ మెహిందిపట్నం నుంచి ప్రతి 2 గంటలకి ఒకసారి బస్ లు కలవు. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం అధిక రద్దీ ఉంటుంది. మరియు పండుగల సమయాలలో కూడా రద్దీ అధికం.
ఆలయ దర్శన సమయం :
ప్రతి రోజు ఉదయం 05:00 నుంచి12:30వరకు
మధ్యాన్నం 12:30 నుంచి 3:30 వరకు బ్రేక్
తీరిగీ 03:30 నుంచి 8:00 వరకు తెరిచి ఉంటుంది.
.
.
#Hyderabad Temples, #Budget travel, #hyderabad vlog, #viral #hindutemplesguide #HiddenHyderabadTemples

Comments
Post a Comment