Birla mandir | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ హుసేన్ సాగర్ కి 1 కి.మీ. దూరం లో కలదు. ఈ ఆలయం 1976 సం|| లో నిర్మించారు. ఈ ఆలయం 13 ఏకరాలలో ఉన్నది. ఈ ఆలయం పూర్తిగా రాజస్థాన్ తెల్ల పాలరాతితో ఆలయం. ఈ ఆలయం నిర్మించిన వ్యక్తి మీదనే ఈ ఆలయానికి బిర్లా మందిర్ అనే పేరు వచ్చినది. ఆలయంలో ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవచ్చు. పెద్ద మనుషులకి , మరి కొంత మందికి ఆలయం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కుడా ఉన్నది. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రాంతాలలో ఈ ఆలయం ఒకటి. సమయం ఉంటే సాయంత్రం వెళ్ళడం ఉత్తమం. ఆ ఆలయం రాత్రి సమయంలో మరింత శోభయమనగా కనువిందు చేస్తుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 07:00 -12:00 వరకు
మధ్యాన్నం 12:00-4:00 వరకు బ్రేక్
తీరిగీ సాయంత్రం 04:00-రాత్రి 09:00 వరకు.
ఈ ఆలయానికి చేరుకోవడానికి 2 దారులు కలవు. 1 నడక దారి . 2 వాహన దారి.
నడకదారిలో చేరుకోవడానికి సుమారు 100 మెట్లు ఏక్కలి. వాహనంలో డైరెక్ట్ గా ఆలయ పార్కింగ్ వరకు చేరుకోవచ్చు.
ఆ ఆలయంలో ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర స్వామి తో పాటూ , గణపతి ,సరస్వతి , శివ , పార్వతి , సీత రాముడు, హనుమాన్ ఆలయాలు దర్శించవచ్చు. అలాయంలోనికి సంప్రదాయ దుస్తులలోనే అనుమతి ఇస్తారు, సెల్ ఫోన్ తీసుకొని పోనివ్వరు. కింద లాకర్ లో బద్ర పరుచుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవడానికి అన్నీ ప్రాంతాల నుంచి మొదట టాంక్ బాండ్ కి చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి నడక మార్గంలో చేరుకోవచ్చు.
.
#Hyderabad Temples, #Budget travel, #hyderabad vlog, #viral #hindutemplesguide #HiddenHyderabadTemples

Comments
Post a Comment