Top 10places to visit in Karnataka | Hindu Temples Guide

 

కర్ణాటక రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలు : 

1. గోకర్ణ : రావణాసురుడు పూజించిన మహాబలేశ్వర లింగం ఇక్కడ కలదు. తప్పుకుండా మహాశివరాత్రి రోజు దర్శించాల్సిన ఆలయం. 

2.ఉడిపి : ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రనికి సౌత్ ఈస్ట్ లో కలదు. 13వ శతాబ్దం లో నిర్మించిన శ్రీ కృష్ణ ఆలయం కలదు. తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇది. ఇక్కడ కొద్ది దూరంలోనే బీచ్ లు కూడా కలవు.  

3. హంపి : విజయనగర సామ్రాజ్య రాజు నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడ గోపురం నీడ రివర్స్ లో పడుతుంది. ఇక్కడ  సెల్ ఫోన్ సింగ్నల్ లు సరిగ్గా ఉండవు. మన 50 రూపాయల నోట్ మీద ఉండే గుర్తు ఈ ఆలయం నుంచే తీసుకున్నారు. 

4. దండెలి : ఈ ప్రాంతం చూడడం ఒక అదృష్టం. సిటీ లైఫ్ నుంచి కాస్త విశ్రాంతి కోరుకునే వాళ్ళు, అడివి లో ప్రయాణం చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్రాంతాన్నీ తప్పక చూడాలి. ఇక్కడ ప్రధానంగా కాళీ నది , కాలవ గుహలు, యన్షి జాతీయ పార్క్ కలవు. 

5. కూర్గ్ : మనసును ఇట్టే ఆకర్శించే అందమైన కొండలు, ఇక్కడ కాఫీ తోటలు, చూడచక్కటి కొండలు, అడవిలోని వ్యూ పాయింట్ మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తావి. 

6. సకలేషపూర :  ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో వెస్ట్రన్ ఘాట్ లు కలవు.  18వ శతాబ్దంలో నక్షత్ర ఆకారంలో మంజరబాద్  కోట, బయోడైవర్సె రిజర్వ్ ఫారెస్ట్ , జింకలు, పక్షులు ఈ ప్రాంతం లో దర్శించవచ్చు. 

7 కర్కాల : మౌర్య మరియు విజయనగర సామ్రాజ్య రాజు నిర్మించిన కట్టడాలు , ఆర్కిటెక్చర్ , చతుర్ముఖ బాసకది బాహుబలి విగ్రహం , రోమన్ చర్చి లు ఇక్కడ చూడవచ్చు.  

8. చీకమంగుళూరు: ఇక్కడ ప్రధానంగా ముల్లాయణగిరి అనే కొండలు ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రాంతం. కాఫీ తోటలు అదనపు ఆకర్షణగా ఉన్నయి, 

9.  షిమోగా : భద్ర వైల్డ్ లైఫ్ లో ప్రయాణం చేయాలి అనే వారికి ఇది చక్కటి ప్రాంతం. ఇక్కడ ఏనుగుల నివాస ప్రాంతాలు, పులులు , ఇతర అడివి జంతువులను చూడవచ్చు, 

10. చీకబళ్లాపూర్ : ఈ ప్రాంతం లో ప్రధాన ఆకర్షణ శివయ్య, 112 అడుగుల పొడవు , 82 అడుగుల అడ్డం లో ఒక్క సారి ఆ మహా శివుని విగ్రహం ఐన ఆ ఆదియోగి ని దర్శించగానే మనస్సు ప్రశాంతతాకి లోనూ అవుతుంది, ప్రతి రోజు ఇక్కడ సాయంత్రపు సమయం లో లెసర్ షో వేస్తారు ఆది తప్పక దర్శించాలి. 

pic credit and soure : Tourism of india 

Keywords : Gokarna Tour, Karkala Tour, Dandeli Tour, Hampi Tour, Coorg Tour, Chikballapur Tour, Shimoga Tour, Sakllespura Tour, Udipi Temple, Chikmangalore Tour, Karnataka state, Hindu temples guide.

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana