Low Budget Ujjainimahakal tour plan Madhyapradesh

 


ఈ ఆలయం టూర్ ప్లాన్ లో అతి తక్కువ ఖర్చుతో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వ లింగం. ప్రతిరోజు ఆ మహా  శివుడికి ఉదయం కేవలం ఈ ఆలయంలో మాత్రమే భస్మ హారతి ఇస్తారు. ఆది కూడా ఉదయం 4:00గంటలకి. దానికి చాలా మంది వస్తారు కావున ముందే ఆ హారతికి ఆన్లైన్ లో రిసర్వేషన్ చేసుకోవడం మరచిపోవద్దు.

ఈ ఆలయం చేరుకోవడానికి మొదట సికింద్రాబాద్ నుంచి 12720 అనే ట్రైన్ హైదరాబాద్ నుంచి జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు. ఈ ట్రైన్ కేవలం సోమవారం మరియు మంగళవారం మాత్రమే బయలుదేరుతుంది. ట్రైన్ లో 1235 కి.మీ దూరం ప్రయాణం చేయాలి. ఈ ట్రైన్ రాత్రి 08:55 గంటలకి ప్రారంభం అయి మరుసటి రోజు సాయంత్రం 4:55 గంటలకి చేరుకుంటుంది. ట్రైన్ లో స్లీపర్ క్లాస్ టికెట్ ధర 555/- మాత్రమే. 

రైల్వే స్టేషన్ నుంచి 150/- ఆటో వాలకి ఇస్తే ఆలయం వద్ద డ్రాప్ చేస్తారు.  ఆలయం వద్ద ప్రైవేట్ హోటల్ లు కలవు. ఒక్కరికీ ఒక్కరోజుకు 750 చార్జి చేస్తారు. ప్రధాన ఆలయం తరువాత ఆలయ వద్ద ఆటో వల్లే చుట్టూ ప్రక్కల ఇతర చూడదగిన ప్రాంతాలు మరియు ఆలయాలు చూపిస్తారు. అందుకు గాను ఒక్కరికీ 500/- తీసుకుంటారు. మనం ఎక్కువ మంది ఉంటే ఇంకా తక్కువ ధరకే మాట్లాడవచ్చును. 

మొదట కాలభైరవ ఆలయం చూపిస్తారు. ఈ ఆలయం ఉజ్జయిని వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేయాలి. ఇక్కడ స్వామి కి మందునే నైవేద్యంగా సమర్పిస్తారు. 

తరువాత మంగళనాథ్ ఆలయం. గ్రహధోష నివారణ కొరకు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకు రూ|| 1,000/- నుంచి రూ|| 10,000/- వరకు చెల్లించాలి. 

కాళిక మాతా ఆలయం. ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు.  ఇక్కడ అమ్మవారు సిందూరవర్ణంలో దర్శనం ఇస్తారు.  ఈ అమ్మవారి సాయంత్ర హారతి చాలా బాగా ఉంటుంది. 

మహాకాల్ లోక్ కారిడార్ ఇక్కడ సాయంత్రం చూడడానికి చాలా బాగా ఉంటుంది. అని లైట్లతో చూడముచ్చట గా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటో ఘాట్ కి కూడా చాలా బాగా ఉంటుంది ఈ ప్రాంతం. ప్రవేశం ఉచితం. ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఉంటుంది. కానీ రాత్రి సమయంలో దర్శించడం ఉత్తమం. 

.

keywords : Low Budget tour, ujjain mahakal, travel under budget, tour guide, madhyapradesh state tour, Hindu temples guide, travelling, explore, vloger 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana