BUDGET TRAVEL KASHI | AYODHYA | PRAYAGRAJ YATRA | BHARAT GAURAV TOURIST TRAIN
కాశీ - అయోధ్య -ప్రయాగ్ రాజ్ యాత్ర :
మనలో చాలా మంది ఒక్కసారి ఐన కాశీ యాత్ర , అయోధ్య యాత్ర చేయాలి అని అనుకుంటారు కానీ అంతా దూరం మరియు ప్రయాణం ఖర్చులకు కొంత మంది ఆలోచించి వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు మీ యొక్క భయన్ని పోగొట్టడానికి భారత్ రైల్వే వారు ఒక కొత్త అవకాశం కలిపించారు.
ఈ ట్రైన్ కి నెంబర్ ఉండదు. కానీ కేవలం పేరు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్. వీటికి ప్రత్యేక టికెట్ తీసుకోవాలి. ఇందులో 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ట్రైన్ పాకేజ్ లో వారణాసి , అయోధ్య , ప్రయాగ్ రాజ్ ని దర్శించవచ్చును. ఇందులో మనకి ట్రైన్ ప్రయాణం, బస్ ప్రయాణం,హోటల్, ఫుడ్, ఇన్షూరెన్స్, గైడ్ తో సహ ఇస్తారు.
ఈ ట్రైన్ టికెట్ ధర 12490/- గా నిర్ణయించడం జరిగినది. ఇది కేవలం స్లీపర్ క్లాస్ ధర. మీకు కావాలి అంటే 3A/C & 2A/C సీట్ లు కూడా అందుబాటులో కలవు. దానికి ధర అధికంగా ఉంటుంది. ఈ ట్రైన్ పూణే లో ప్రారంభం అయి అని చూపించుకొని తీరిగీ పూణే లో డ్రాప్ చేస్తుంది. ప్రయాణ తేదీ ఈ నెల 24/07/2024 నుంచి 30/7/2024 వరకు జరుగుతుంది.
మొదట పూణే లో ప్రారంభం ఐన ఈ ట్రైన్ వారణాసి లో సార్నాథ్ , కాశీ విశ్వనాథ ఆలయం , గంగ హారతి , తరువాత అక్కడి నుంచి అయోధ్య కి చేరుకొని రామా జన్మ భూమి , హానుమంగర్హి , తరువాత ఇక్కడి నుంచి ప్రయాగ్ కి చేరుకొని త్రివేణి సంగం ని చూపించి చివరన మళ్ళీ పూణే కి చేరుకుంటుంది.
మరో ముఖ్యవిషయం ఏమిటనగా ప్రయాణ ప్రారంభం అయే 4 రోజుల ముందు టికెట్ కాన్సెల్ చేస్తే ఎటువంటి డబ్బు తీరిగీ ఇవ్వరు. ఆలయాలలో ఎటువంటి ప్రత్యేక దర్శనాలు వీరు చేపించరు. అక్కడ ఖర్చు అంతా ప్రయాణికులదే. కొని సార్లు ప్రయాణ సమయంలో ఆలస్యం కావొచ్చు.
credit and source : పూర్తి వివరాల కొరకు ఈ వెబ్సైట్ ని దర్శించండి : https://www.irctctourism.com టికెట్ బుక్ చేసే ముందే terms & conditions చదవగలరు. (ఈ వెబ్సైట్ కి హిందూ టెంపుల్ గైడ్ కి ఏటువంటి సంబందం లేదు.)
.
.
key words : KASHI YATRA, AYODHYA YATRA, PRAYAGRAJ YATRA, LORD SHIVA, IRCTC, Hindu temples guide, Budget travel

Comments
Post a Comment