Kedarnath travel details in budget | Travel , Food, Stay Under budget | బడ్జెట్ లో కేధారనాథ్ యాత్ర వివరలు
బడ్జెట్ విభజన :
ప్రయాణం, ఆహారం, హోటల్
మొదటి రోజు :
ఈ ట్రైన్ మొదట బెంగళూరు నుంచి బయలుదేరి వయ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ రైలులో 22691 (సికింద్రాబాద్ నుండి హజారత్ నిజాముద్దీన్ ట్రైన్ లో ఉదయం 07:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు 3822/-) .
రెండవ రోజు :
తరువాత రోజు ఢిల్లీ నుంచి హరిద్వార్ కి బస్సు 450/- టికెట్ ధర మరియు a/c బస్ కొరకు redbus, abhibus కోసం అదనంగా చెల్లించవలెను. హరిద్వార్ లో ఒక రోజు గది ధర 2671/-+ GST అదనం. ఈ హోటల్ కేదార్ గంగాకి కేవలం7 కి.మీ దూరం లో కలదు. గంగా ఘాట్ దగ్గర హోటల్ రామవతి వద్ద కూడా కలదు. రాత్రి ఇక్కడే బస చేసుకోవచ్చు.
మూడవ రోజు :
హరిద్వార్ నుండి సూన్ ప్రయాగ్ కి బస్ లు ఉన్నాయి. ప్రభుత్వా మరియు ప్రైవేట్ బస్ లు కలవు. బస్ లో ఒక్కరికీ టికెట్ ధర 1500/- రాత్రికి సోన్‌ప్రయాగ్ లోనే బస చేయువలెను. సోన్‌ప్రయాగ్ దగ్గర సీతాపూర్ అనే బస్ స్టాండ్ కూడా ప్రైవేట్ హోటేల్స్ కలవు అక్కడ కూడా తక్కువ ధర కే హోటల్ రూమ్స్ లభిస్తాయి.
నాల్గవ రోజు :
సోన్‌ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ జీప్ సర్వీస్ కలదు. ఒక్కరికీ 500/- చార్జి చేస్తారు. గౌరీకుండ్ నుండి కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ 22కి.మీ. దూరం కలదు. కేదార్‌నాథ్ లో స్టే చేయడానికి ఒక్కరికీ 4000/- అది కూడా నంది కాంప్లెక్స్, స్వర్గ్రోహిణి కాంప్లెక్స్ కాటేజీలలో మాత్రమే ఈ ధర లు కలవు.
ఐదవ రోజు :
తిరుగు ప్రయాణం కేదార్‌నాథ్ (ట్రెక్) గౌరీకుండ్ జీప్ సర్వీస్ 500/- రాత్రి కి సోన్‌ప్రయాగ్ లో బస చేయవలిసి ఉంటుంది. ప్రైవేట్ హోటేల్స్ అందుబాటులో కలవు. ఇక్కడ కూడా తక్కువ ధర కే హోటల్ రూమ్స్ లభిస్తాయి. సమయం ఉంటే చుట్టూ పక్కన ప్రాంతలు దర్శించవచ్చు.
ఆరవ రోజు :
సోన్‌ప్రయాగ్ నుండి రిషికేశ్ వరకు బస్సులో ప్రయాణించాలి అందుకు టికెట్ ధర 2800/- రిషికేశ్ లో బస చేయవలిసి ఉంటుంది. ఒక్కరికీ గాను 1600/- ప్రైవేట్ హోటేల్స్ కలవు. అక్కడ కూడా తక్కువ ధర కే హోటల్ రూమ్స్ లభిస్తాయి. మీకు ఇంకా సమయం ఉంటే త్రివేణి సంగమం ఘాట్ వద్ద గంగా హారతిని దర్శించవచ్చు.
ఏడవ రోజు :
రిషికేశ్ నుండి ఢిల్లీకి బస్సు వరకు డైరెక్ట్ బస్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కరికీ 3500/- టికెట్ ధర కలదు. ఢిల్లీ నుండి హైదరాబాద్ (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు) లో 1845/-చెల్లిచావలెను. ఆహారం కొరకు రిసర్వేషన్ లో అదనపుగా చెల్లించవలెను.
ఎనిమిదవ రోజు :
హైదరాబాద్‌కు చేరుకోవడానికి కనీస ఆహార బడ్జెట్ 1500/- ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఈ ఫలహారం ఖర్చు.
keywords : Kedarnath, budget, Budget Travel, India famous temple, temple guide, hindu temple guide

Comments
Post a Comment