Hiden Ayurvedik place in kashi | varanasi | Utter pradesh
ఆయుర్వేదిక్ ఆలయం :
మనలో చాలా మంది మోక్షాన్ని ప్రసాదించే ద్వాదశ జ్యోతిర్లింగం ఐనా కాశీ ని దర్శించుకుని ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ ప్రాంతం మనలో చాలా మందికి చేయకపోవచ్చు.
మృత్యుంజయ మహాదేవ ఆలయం , కాశీ ఈ ప్రాంతం ధారానగర్ కాలభైరవ ఆలయం వద్ద ఈ మహాదేవ ఆలయం కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ప్రాంగణంలో పురాతన బావి కలదు. దీనిని ఇక్కడి ప్రజలు కూప్ అని పిలుస్తారు.
ఈ బావి నుంచి వచ్చే నీటిని వివిధ వ్యాధులకు దివ్యౌషధంగా భావించబడుతుంది మరియు భక్తులు మరియు సందర్శకులు తాగి చికిత్సా నుంచి బయట పడుతారు.
అందుకు కారణం ఈ బావి ని ఆయుర్వేద దేవుడు ఐనటువంటి ధన్వంతరి స్వామి నిర్మించారు అని అందువల్లనే ఈ నీటికి ఇంతటి శక్తి కలదు అని ఒక కధ ప్రచారంలో కలదు.
కాని మరియొక్క కధ ప్రకారం ఈ బావి కింద నుంచి భూగర్భ నీటి ప్రవాహాల మిశ్రమాలతో కలవడం వల్ల ఈ నీటికి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడే ఒక ప్రత్యేకమైన శక్తి లభీస్తుంది అని ప్రచారంలో కలదు.
ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం 4:00 గంటలకి ప్రారంభం అవుతుంది. ఉదయం 5:30 కి ప్రారంభ హారతి , సాయంత్రం 6:30 కి ఒక హారతి , చివరగా 11:30 కి ఆలయం మూసే ముందు చివర హారతి ఇస్తారు. తప్పక ఈ హారతిలను దర్శించుకోవాలి. కాశీ లో మొదట కాశీ క్షేత్ర పాలకుడు అనట్టువంటి కాలభైరవ స్వామి ఆలయం , తరువాతనే కాశీ విశేశ్వర స్వామి దర్శించుకోవాలి.
ఆ తరువాత ఈ ఆలయం , బావి ని దర్శించుకోవాలి. అప్పుడు మనం సరియైన దర్శనం చేసుకున్న వాళ్ళం అవుతాము. కేవలం ఈ ఒక్క బావి మాత్రమే కాకుండా కాశీ మొత్తం దాదాపుగా 10 బావుల కంటే ఎక్కువ ఈ కాశీ లో కలవు.

Comments
Post a Comment