Budget travel to Adiyogi | Coimbatore | Tamilnadu

 


శ్రీ ఆదియోగి శివయ్య దర్శనం : 

చుట్టూ అడవి వాతావరణంలో కొండల మధ్య  112 అడుగుల శివయ్య ని అతి తక్కువ ఖర్చులో కొయంబత్తూరు లోని శ్రీ ఆది యోగి శివయ్య ని దర్శించుకోవడం కొరకు మొదట మీరు ఉన్న ప్లేస్ నుంచి ప్రధాన రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి. అక్కడి నుంచి కొయంబత్తూరు కి చేరుకోవాలి. 

హైదరాబాద్ నుంచి 12789 అనే ట్రైన్ కాచిగూడ నుంచి ఉదయం 06: 00 గంటలకి ప్రారంభం అవుతుంది. అర్దరాత్రి 01:00 గంటలకి కొయంబత్తూరు రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి బస్ మరియు ఆటో లో ఇషా ఆలయంకి చేరుకోవచ్చు.

నెల రోజుల ముందే కాటేజ్ ఇషా.ఇన్ అనేటువంటి ఇషా వెబ్సైట్ లో  రూమ్ ని  బుక్ చేసుకోవాలి. ఒక్క రోజుకి  ఒక రూమ్ లో 2 వ్యక్తులకి సరిపోతుంది. అందుకు వారు 1000/- చార్జి చేస్తారు. 

ఇందులో మీకు మధ్యానం భోజనం , రాత్రికి భోజనం కూడా వారే ఇస్తారు. ఈ ఆది యోగి ప్రవేశం ఉదయం 6 గంటలకి ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకి ముగుస్తుంది. ముఖ్యమైన రోజులలో దర్శన సమయం లు మార్చబడతాయి. 

సాయంత్రం 7:15 నిమిషాలకి 3d లెసర్ షో ప్రారంభము అవుతుంది. జీవితం లో ఒక్కసారి ఐనా ఈ షో తప్పక దర్శించాలి. ఆ శివయ్యే మన ముందు ఉండి తన లీలలను మనకు చూపించి మన శరీరం  రోమాంఛితము అవుతుంది. 

విశాఖ పట్నం వారికి 13351 DHN ALAPPUZHA Express ప్రతి రోజు ఉదయం 8:30 బయలుదేరి తరువాత రోజు 8:30 కి చేరుకుంటుంది. ఒక్కరికీ టికెట్ 565/- మాత్రమే. 


key words :  Adiyogi , famous temples at Coimbatore,  Tamilnadu tour , Budget travel, Hindu temples guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana