One day shiridi plan | Shiridi | Maharashtra | Budget Travel
ఒక్క రోజులో శిరిడీ ఆలయ దర్శనం :
మొదట ట్రైన్ లో సాయి నగర్ శిరిడీ అనే రైల్వే స్టేషన్ కి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఆలయం వద్ద ప్రైవేట్ హోటల్ కు చేరుకోవాలి. లేదా ఆలయం వారివి కూడా హోటల్ లు కలవు. ఆలయం నుంచి కొంత దూరం నడవ వలసి ఉంటుంది. ప్రైవేట్ వి ధర ఎక్కువ.
ఇక్కడ మనకు రెండు రకాల దర్శనాలు కలవు. మొదటిది ఉచిత దర్శనం. ఈ ఉచిత దర్శనం లో ఏటువంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ దర్శనం అయ్యే వరకు 3 గంటల సమయం పడుతుంది. రెండవ దర్శనం 200/- రూపాయాల విఐపి దర్శనం టికెట్. ఇది కొంచం తొందరగానే ఆ సైనాధుడు దర్శనం చేసుకోవచ్చు. బయటికి వచ్చాక పక్కనే చావడి ఉంటుంది. చాలా చిన్న ఆలయం.
ఆ తరువాత ద్వారకామాయి ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఈ ద్వారకామాయిని నిర్మించారు. సుమారు 100 సం|| నుంచి ఈ ద్వారకామాయిలో దుని నిత్యం వేలుగుతూనే ఉంటుంది. కొద్ది దూరం లో హనుమాన్ ఆలయం కూడా కలదు. అక్కడి నుంచి బయటికి వస్తే ఆలయం వల్లే అందరికీ పాలు ఇస్తారు. చిన్న పిల్లలకి , ఆడవారికి ప్రత్యేక లైన్ లు కలవు. సమయం ఉంటే ఖచ్చితంగా స్వామి వారికి చేసే హారతి లను కూడా దర్శించండి. ఒక్కో హారతి కనీసం 20 నిమిషాలు ఐన ఇస్తారు.
తరువాత రోజు సమయం ఉంటే చుట్టూ పక్కల ప్రాంతాల దర్శనం కొరకు అక్కడే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని అడగవచ్చు. వారితో ఏళ్ళప్పుడు జాగ్రత్త గా ఉండవలెను. చుట్టూ పక్కల గల ఆలయాలు : ప్రధాన ఆలయం , శని దేవుని ఆలయం, పంచవటి, ముక్తి ధామ , నాసిక్ , త్రయంబహకేశ్వర్ , పండరి పూర్ , తుల్జా పూర్, కేవుస్ మొదలైనవి కలవు.
ఈ ఆలయం చేరుకోవడానికి ట్రైన్ పేరు రాజ్ కోట్ ఎక్స్ప్రెస్ . సికింద్రా బాద్ నుంచి శిరిడీ వరకు కలదు. ట్రైన్ నెంబర్ 17002. కేవలం శుక్రవారం , ఆదివారం మాత్రమే. బయలు దేరే సమయం సాయంత్రం: 4:10ని || ట్రైన్ లో దూరం 776. కి. మీ. టికెట్ ధర జెనెరల్ లో 210/- స్లీపర్ క్లాస్ లో 410/- . ఆలయ దర్శన సమయం ఉదయం 4:30 నుంచి రాత్రి 10:00.
ఆలయ చిరునామా : Sai Baba Samadhi Mandir Shirdi Temple
80/3, Maharashtra State Highway 10,
Mauli Nagar, Shirdi,
Maharashtra,
pincode 423109,
India
.
.

Comments
Post a Comment