Sri SitaRamaChandraswamy Devasthanam | Shamshabad | Hindu Temples Guide
ఈ ఆలయం పేరు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. దేవాలయం అమ్మాపల్లి అనే గ్రామం లో శంషాబాద్ నందు కలదు. ఈ దేవలయన్ని చాళుక్య రాజులు నిర్మించారు. ఈ ఆలయన్ని సినిమా గుడి అని కూడా అంటారు. సినిమాలలో గుడిలలో ఉండే సన్నివేశాలు ఇక్కడ తీయడం జరుగుతుంది. ఈ ఆలయానికి 800 సం|| కంటే పైగా చరిత్ర కలదు. ప్రధానంగా ఈ ఆలయం మురారీ సినిమా నుంచి పౌర్ణమి సినిమాలోని భరతవేగముగా అనే పాట నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలలో ఈ అలయని చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా సీతారామ లక్ష్మణ స్వామి వారి మూర్తి పూర్తిగా మకరతోరణాలు కలిగి ఉంటాయి. ఆలయ ప్రధాన గర్బా ద్వారం ఎదురుగా రాతితో చెక్కబడిన తాబేలుని దర్శించవచ్చు. ఈ ఆలయం పూర్వం 250 ఎకరాలు ఉండగా ఆక్రమణ గురి అయి ప్రస్తుతం కొద్ది ప్రాంతంలోనే ఈ ఆలయం కలదు. ఆలయానికి ఏదురుగా చక్కటి పూలతోట మరియు మొక్కజొన్నల తోటలు చూడవచ్చు. ఆలయం పక్కనే పెద్ద కోనేరు కలదు. ఇక్కడ పెళ్లల ఫోటో ఘాట్ చాలా బాగా జరుగుతుంది. అతి లోతైన కోనేరు, చక్కటి విశాలమైన మెట్లు శంషాబాద్ నుంచి 6కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. ఇక్కడ ఆలయ సంరక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఇక్కడ రాముల వారు కోదండరామ స్వామిగా పిలుస్తారు. సీ...