ఒక్క రోజులో శిరిడీ ఆలయ దర్శనం : మొదట ట్రైన్ లో సాయి నగర్ శిరిడీ అనే రైల్వే స్టేషన్ కి చేరుకున్న తరువాత అక్కడ నుంచి ఆలయం వద్ద ప్రైవేట్ హోటల్ కు చేరుకోవాలి. లేదా ఆలయం వారివి కూడా హోటల్ లు కలవు. ఆలయం నుంచి కొంత దూరం నడవ వలసి ఉంటుంది. ప్రైవేట్ వి ధర ఎక్కువ. ఇక్కడ మనకు రెండు రకాల దర్శనాలు కలవు. మొదటిది ఉచిత దర్శనం. ఈ ఉచిత దర్శనం లో ఏటువంటి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ దర్శనం అయ్యే వరకు 3 గంటల సమయం పడుతుంది. రెండవ దర్శనం 200/- రూపాయాల విఐపి దర్శనం టికెట్. ఇది కొంచం తొందరగానే ఆ సైనాధుడు దర్శనం చేసుకోవచ్చు. బయటికి వచ్చాక పక్కనే చావడి ఉంటుంది. చాలా చిన్న ఆలయం. ఆ తరువాత ద్వారకామాయి ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఈ ద్వారకామాయిని నిర్మించారు. సుమారు 100 సం|| నుంచి ఈ ద్వారకామాయిలో దుని నిత్యం వేలుగుతూనే ఉంటుంది. కొద్ది దూరం లో హనుమాన్ ఆలయం కూడా కలదు. అక్కడి నుంచి బయటికి వస్తే ఆలయం వల్లే అందరికీ పాలు ఇస్తారు. చిన్న పిల్లలకి , ఆడవారికి ప్రత్యేక లైన్ లు కలవు. సమయం ఉంటే ఖచ్చితంగా స్వామి వారికి చేసే హారతి లను కూడా దర్శించండి. ఒక్కో హారతి కనీసం 20 నిమిషాలు ఐన ఇ...